మోతుగూడెంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

528చూసినవారు
మోతుగూడెంలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ పరిధిలోని 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోతుగూడెం లోని స్థానిక చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీరు శ్రీధర్ జండా ఆవిష్కరణ చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు.
అలాగే మోతుగూడెం లోని ప్రభుత్వ పాఠశాలలు ఎం పి యు పి స్కూల్ నందు సర్పంచ్ సీత జెండా ఆవిష్కరణ చేశారు. ఈ వేడుకల్లో స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీ మీనా కబ్బా రావు పాల్గొన్నారు. జడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు శ్యాంసన్ జండా ఆవిష్కరణ చేశారు. స్థానిక డిఏవి పబ్లిక్ స్కూల్ నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

స్థానిక పోలీస్ స్టేషన్లో సివిల్ పోలీసులు మరియు బి 42 సిఆర్పిఎఫ్ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. 1104 యూనియన్, 327 యూనియన్, సిఐటియు, 15 35 యూనియన్ ఆఫీసు నందు జండా ఆవిష్కరణ చేశారు. అలాగే మోతుగూడెం మేజర్ గ్రామ పంచాయతీలో సెక్రెటరీ రవి నాయక్ జెండా ఆవిష్కరణ చేసారు.

ఈ వేడుకల్లో స్థానిక చీఫ్ ఇంజనీర్ కార్యాలయం నందు డి. ఈ బాలకృష్ణ, అలాగే గ్రామ సచివాలయం నందు ఎంపీటీసీ వేగి నాగేశ్వరావు, సర్పంచ్ సీత, ఉప సర్పంచ్ సుజాత, వార్డు మెంబర్లు మల్లూరి రమాదేవి, పేరు మాళ్ళ దేవుడు, రాజమ్మ, దేవ, రాంబాబు, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్