చింతూరు: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

69చూసినవారు
చింతూరు: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
విద్యార్థి దశ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే. రత్న మాణిక్యం అన్నారు. సోమవారం వరల్డ్ కంప్యూటర్ లిటరసి డే సందర్భంగా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాంకేతిక విద్య పట్ల మక్కువ కలిగి ఉండాలన్నారు. కంప్యూటర్ చరిత్ర, కంప్యూటర్ విద్య ఆవశ్యకతను తెలియజేశారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం ప్రతి రంగంలో అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్