అల్లూరి జిల్లాలో విలీన మండలాలైన చింతూరు కూనవరం విఆర్. పురం ఎటపాక మండలాల్లో పదో తరగతి పరీక్షలకు 10 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎంఈఓ లక్ష్మీనారాయణ సోమవారం తెలిపారు. ఈ మండలాల్లో వివిధ పాఠశాలలకు చెందిన 1420 విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కూడా విద్యార్థులకు ప్రయోజనం కలిగిందని తెలిపారు.