దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే 15 పర్యాటక బోట్లకు అనుమతులు ఉన్నాయని టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. బుధవారం రెండు పర్యాటక బోట్లలో 90 మంది పర్యాటకులు పాపికొండలు విహారయాత్రకు వెళ్లినట్లు తెలిపారు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయ సమీపంలో బోట్ పాయింట్ వద్ద 15 పర్యాటక బోట్లు ఉంటాయని, అన్ని బోట్లకు అనుమతులు ఉన్నాయని వెల్లడించారు.