పురుషోత్తపట్నం పంపింగ్ స్కీంలో పనిచేసే సత్యసాయి కార్మికులకు రెండు నెలల జీతాలు గురువారం ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దేవీపట్నం, గంగవరం, రంపచోడవరం, గోకవరం, కోరుకొండ మండలాలలో గ్రామాలకు నీటిని సరఫరా చేసే కార్మికులకు 21 నెలలుగా జీతాలు లేవు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. దీంతో పవన్ తన సొంత నిధులు రూ. 20 లక్షలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.