సెయింట్ మేరిస్ లో ముగిసిన నాట్ పరీక్ష

158చూసినవారు
సెయింట్ మేరిస్ లో ముగిసిన  నాట్ పరీక్ష
దేశం లోని అన్ని ప్రైవేటు యాజమాన్య పాఠశాల విద్యార్థులకు నిర్వహించే నాట్( నేషనల్ ఆప్టిట్యూడ్) పరీక్షను బుధవారం సెయింట్ మెరిస్ పాఠశాల పరీక్షా కేంద్రంగా రౌండ్ -1 నాట్ పరీక్ష నిర్వహించినట్టు ఆ పాఠశాల కరస్పాండెంట్ మినిమొల్ తెలిపారు. మొత్తం ఈ పరీక్షకు 50 మందికి పైగా తమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారని, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు వచ్చే నెల జనవరి 28 వ తేదీన జిల్లా స్థాయిలో అన్ని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల వారికి జరిగే నాట్ యొక్క రౌండ్ -2 పరీక్ష వ్రాస్తారని తెలిపారు. ఈ రౌండ్ -2 లో ఉత్తీర్ణత సాధించిన వారికి అవార్డులు ప్రధానం నిసా సంస్థ వారు అందిస్తారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా గతం లో తమ పాఠశాల విద్యార్థిని స్మైలి వైజాగ్ లో అవార్డు అందుకుని ఏజెన్సీ పాఠశాల ను రాష్ట్రం లో ప్రముఖ స్థానం లో నిలిపిందనీ గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్