ఈనెల 26వ తేదీన మహాశివరాత్రి పురస్కరించుకొని రాజవొమ్మంగి మండలంలోని కొండమీద ఉన్న శ్రీశ్రీశ్రీ రాజేశ్వరి సామెత రామలింగేశ్వరస్వామి వారి దేవాలయానికి రహదారి నిర్మాణ పనులను సర్పంచ్ పెద్దిరాజు శనివారం ప్రారంభించారు. 26 తేదీన జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలకు స్వామి వారి ఆలయం హంగులతో ముస్తాబు అవుతుందన్నారు. అన్నసంతర్పణ కార్యక్రమం ఉంటుందని చుట్టుపక్కల భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.