చింతూరు మండలం మోతుగూడెం గ్రామంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా శనివారం అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ టి.రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజల రక్షణ ధన మాన ప్రాణాలు కాపాడటంలో పోలీసులు తమ శక్తి వంచన లేకుండా విధులు నిర్వహిస్తారనేది, అమరుల త్యాగాలకు గుర్తుగా 1960లో అక్టోబర్ 21న అమరవీరుల సంస్మరణ దినోత్సవం గా నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిందని తెలియజేశారు.