రంపచోడవరం నియోజకవర్గం వై. రామవరం మండలంలోని యార్లగడ్డ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల డొంకరాయి జడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి తెలుగు పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసిందని ఎంఈఓ వెంకటరావు తెలిపారు. యార్లగడ్డ పాఠశాలలో మొత్తం 164 మంది విద్యార్థులకుగాను 163 మంది హాజరయ్యారని ఒక్కరూ గైర్హాజరైనట్లు తెలిపారు. డొంకరాయి పాఠశాలలో 66 మందికి 65మంది హాజరు కాగా ఒకరు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.