మలికిపురంలో ఫీజుల దోపిడీ అరికట్టాలి: ఏఐఎస్ఎఫ్

63చూసినవారు
మలికిపురంలో ఫీజుల దోపిడీ అరికట్టాలి: ఏఐఎస్ఎఫ్
కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు దేవ రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు. మలికిపురంలో సోమవారం ఆయన మాట్లాడుతూ. విద్యా సంవత్సరం ప్రారంభమవ్వక ముందే విద్యా సంస్థలు తెరిచి తరగతులు ప్రారంభించి నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. రవాణా సౌకర్యం కల్పించకుండానే క్లాసులకు రమ్మని యాజమాన్యం విద్యార్థులను ఇబ్బంది పెట్టడం తగదన్నారు.

సంబంధిత పోస్ట్