మామిడికుదురు: ప్రమాదకరంగా మారిన రహదారి

60చూసినవారు
మామిడికుదురు నుంచి గోగన్నమఠం వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు అధ్వానంగా ఉంది. పంట కాలువవైపు రోడ్డు పలుచోట్ల దిగబడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద గోతులు ఏర్పడి, వర్షం నీరు నిలిచిపోయింది. ఎంతో కాలం నుంచి ఈ రోడ్డు పరిస్థితి ఇదేవిధంగా ఉన్న ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆదివారం వాపోయారు. దీనిని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్