మామిడికుదురు: అల్పపీడనం.. రైతులలో కలవరం

78చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రైతులలో ఆందోళన నెలకొంది. మామిడికుదురు మండలంలోని పలు గ్రామాలలో బుధవారం పంట పనలపై ఉంది. ఈ తరుణంలో ఆకాశంలో అలుముకున్న దట్టమైన మేఘాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాసర్లపూడి, నగరం, పెదపట్నం, మొగలికుదురు, గెద్దాడ గ్రామాలలో పంట కోత దశకు వచ్చింది. ఈ తరుణంలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో వర్షం కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్