రాజోలు: ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

77చూసినవారు
రాజోలు: ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
రాజోలు మండలం కడలి శివాలయం సమీపంలో సోమవారం ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు. వాటర్ టిన్నులు తీసుకు వెళుతున్న ఆటో అదుపు తప్పి ప్రధాన రహదారిపై తిరగబడింది. ఈ ఘటనలో వేగివారి పాలానికి చెందిన అప్పారి జగదీశ్, సూరిబాబు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్