రాజోలు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం వేకువజామున పచ్చని పంట పొలాలపై మంచు దుప్పటి అలముకుంది. వేకువజామున కురిసిన మంచుతో పంట పొలాలకు వెళ్లే రైతులు, వాకింగ్ కు వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు. దట్టంగా కురుస్తున్న మంచుతో మామిడి, పనస ఇతర పంటల పూత రాలిపోయే ప్రమాదం ఉందని రైతులంటున్నారు. వాహనదారులు సైతం లైట్లు వేసుకుని రహదారులపై ప్రయాణం సాగిస్తున్నారు.