జంట ప్రాంతాలైన తుని, పాయకరావుపేట ప్రాంతాలకు సంబంధించిన తాండవ బ్రిడ్జ్ ను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోమవారం సందర్శించారు. భారీ వర్షాల నేపథ్యంలో తాండవ జలాశయ పరివాహక ప్రాంతం పొంగిపొర్లడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రజలకు జాగ్రత్తలు వివరించారు. అనంతరం పాయకరావుపేటలో లోతట్టు ప్రాంతాలలో హోం మంత్రి అనిత పర్యటించి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.