కాకినాడ జిల్లా తుని పట్టణంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. 33/11 కేవీ వీరవరుపుపేట సుబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ ఫీడర్ లైన్లకు మరమ్మత్తులు, చెట్లు తొలగింపు కారణంగా, శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. బ్యాంక్ కాలనీ, కొత్తపేట, కోర్టు వీధి, బత్తాయి తోట, రెడ్ కాన్వెంట్, దుర్గాదాస్, పార్క్ వీధుల్లో ఈ ప్రభావం ఉంటుంది.