కిరీటం అపహరణ కేసులో మలికిపురంకు చెందిన మహిళ అరెస్టు
తణుకు మండలంలోని వేల్పూరు విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15న గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి. స్వామి వారి 500 గ్రాముల వెండి కిరీటాన్ని అపహరించుకుపోయిన ఘటనకు సంబంధించి మహిళను అరెస్టు చేసినట్లు గ్రామీణ ఎస్సై ఏజీఎస్ మూర్తి శనివారం తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా కోనసీమలోని మలికిపురం గ్రామానికి చెందిన అల్లం దేవి అలియాస్ దుర్గను అరెస్టు చేసి, కిరీటాన్ని స్వాధీనం చేసుకున్నారు.