తుని మండలం సుభద్రమ్మపేట గ్రామంలో నగర సంకీర్తన కార్యక్రమం సోమవారం గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. హిందూ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ధనుర్మాసంలో పల్లెను ఆధ్యాత్మిక పాటలతో నిద్రలేపుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా హరినామ సంకీర్తనలు పాడుతూ గ్రామంలో భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని మహిళా భక్తుల నిర్వహించారు.