AP: అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా బిహేవ్ చేస్తామంటే కుదరదని టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. నేతల పనితీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సీఎం చెప్పారు. ఎమ్మెల్యేలను అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే చంద్రబాబు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని పలువురు అనుకుంటున్నారు.