పశ్చిమలో మొత్తం 112 సాగు నీటి వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం మొగల్తూరు మండలంలో మచ్చగడ, కాళీపట్నం సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. అక్కడి రైతులు రాకపోవడంతో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 110 సంఘాల ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి నాగార్జునరావు తెలిపారు. మొత్తం 112 సాగు నీటి సంఘాల పరిధిలో 1260 టీసీ (ప్రాదేశిక సభ్యులు) ఉండగా 1, 215 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 45 టీసీలకు ఎన్నిక జరగలేదు.