పెనుమంట్ర మండలం లోని పలు గ్రామాలలో మంగళవారం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతులు పండించిన ధాన్యాన్ని పరిశీలించి, పలు సూచనలు అందించారు. ఆయన వెంట స్థానిక రెవిన్యూ సిబ్బంది, ఇతర సిబ్బంది ఉన్నారు. అనంతరం జేసీ ఇరగవరం మండలం పర్యటనకు బయలుదేరి వెళ్లారు.