పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామం లోని శ్రీ ఉమా ఇంద్రేశ్వరస్వామి వారి ఆలయం వద్ద కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం రాత్రి జ్వాలా తోరణం కార్యక్రమం నిర్వహించారు. పొడవాటి స్థంభాలకు జ్వాలని వెలిగించి స్వామి వారి పల్లకీని జ్వాలా తోరణం మధ్యలో అటు ఇటు ఊరేగించారు. జ్వాలా తోరణం కార్యక్రమాన్ని వీక్షించేందుకు వందలాదిగా భక్తులు తరలివచ్చారు