2025 మార్చిలో జరిగే 10 పబ్లిక్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వెరిఫికేషన్ చేయించాలని ప. గో. జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ. సదరు దివ్యాంగ సర్టిఫికెట్లను డిసెంబర్ 18, 19 తేదీలలో భీమవరం పిఎస్ఎంమున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో కలర్ జిరాక్స్ లతో సమర్పించాలన్నారు.