పెనుగొండ మండలం సిద్ధాంతం విద్యుత్ కేంద్రం పరిధిలోని దొంగరావిపాలెం ఫీడర్ మరమ్మతుల కారణంగా సోమవారం పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వీరభద్రరావు తెలిపారు. మల్లేశ్వరం, కడింపాడు గ్రామాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.