ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ఈ రోజు ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ అధ్వర్యంలో భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. అనేక మంది వృద్దులకు పిల్లలకు డెరాలలో ఉండే వారికి భోజనం పంపిణీ చేశారు. ఆ సంస్థ అధినేత రవి మాట్లాడుతూ కనిపెడ సుమతీ వివాహ కార్యక్రమంలో భోజనాలు మిగిలిపోయాయని ఆ విషయం తెల్సుకున్న మేము వెంటనే ఆ భోజనం పేదలకు అన్నదానం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవితో పాటుగా మల్లేష్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.