బాధ్యతలు స్వీకరించిన చింతలపూడి ఎస్సై కుటుంబరావు

54చూసినవారు
బాధ్యతలు స్వీకరించిన చింతలపూడి ఎస్సై కుటుంబరావు
చింతలపూడి ఎస్సైగా కుటుంబరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో లక్కవరం, జంగారెడ్డిగూడెం, టి. నరసాపురం ప్రాంతాల్లో ఎస్సైగా పనిచేసిన ఆయన సాధారణ బదిలీల్లో భాగంగా ముసునూరు నుంచి చింతలపూడి కి బదిలీపై వచ్చారు. ఈ మేరకు స్టేషన్ అధికారులు సిబ్బంది కుటుంబరావుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్