ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్ బి ఐ నగర్ స్థానిక మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న 5 గురు అనాధ పిల్లలకు పుస్తకాలు , పెన్స్ , పెన్సిల్స్ ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంద సంస్థ అందించటం జరిగింది. ఆ అయిదుగురు పిల్లలు ఒక అనాధ శరణాలయంలో ఉంటూ ఈ పాఠశాలకు వస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ అధినేత కనిపెడ. రవి ఒక ప్రోగ్రామ్ కోసం ఆ పాఠశాలకు వెళ్ళడం జరిగింది.