అనాథలకు భోజనం పంపిణీ

64చూసినవారు
చింతలపూడి మండల కేంద్రంలో ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ అధ్వర్యంలో సోమవారం భోజనాలు పంపిణీ చేయడం జరిగింది. రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో ఉంటున్న వృద్దులకు భోజనం అందజేశారు. అనంతరం ఆర్ ఎఫ్ ఎస్ అధినేత రవి మాట్లాడుతూ అనేక మంది వృద్దులు పట్టణంలో భిక్షాటన చేస్తున్నారని వాళ్ళకి మన వంతుగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ భోజనం పంపిణీ అమిత్ కుమార్ పుట్టినరోజు సంధర్భంగా వితరణ చేసినట్టు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో దాసరి బాబు, కాపుదాసి జయ వర్ధన్, టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్