జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇటీవల ఒక డెలివరీ కార్యాలయంలో జరిగిన దొంగతనం కేసులో 4 నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి అపహరణకు గురైన రూ. 3, 73, 592 నగదు, ఒక హార్డ్ డిస్క్, లాకర్, ఎలక్ట్రానిక్ కట్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గతంలో కూడా ఇదే కార్యాలయంలో పని చేస్తూ దొంగతనం చేశారని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు.