చింతలపూడి పట్టణంలోని స్థానిక నందమూరి విద్యానగర్ కాలనీలో ఇటీవల కురిసిన వర్షాలకు లింకు రోడ్లు బాగా దెబ్బతిని స్థానికులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కూటమి నాయకులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం పాడైన రోడ్ల స్థానంలో గ్రావెల్ తరలించి బ్లేడ్ ట్రాక్టర్ తో చదును చేయించి సమస్యను పరిష్కరించారు.