పోతునూరులో ఘనంగా గంగానమ్మ సంబరం

55చూసినవారు
దెందులూరు మండలం పోతునూరు గ్రామ దేవత గంగానమ్మ తల్లి సంబరం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే భక్తులు ఆలయానికి కుంభాన్ని తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో ఉంచారు.  ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్