పెదవేగి మండలం కొండలరావు పాలెంలో మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. తమ చెరువుల ఆదాయాన్ని స్వాహా చేశారంటూ కొల్లేరు ప్రజలు అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద వంట-వార్పు నిర్వహించారు. దీంతో వైసీపీ నేతలు, కొల్లేరు ప్రజల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దౌర్జన్యం చేయొద్దంటూ పోలీసులు పేర్కొన్నారు.