హ్యాండ్లూమ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు

66చూసినవారు
హ్యాండ్లూమ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో హ్యాండ్లూమ్, టెక్స్టైల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని ఏలూరు జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి ఎస్. రఘునంద తెలిపారు. పదో తరగతి, తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులై ఈ ఏడాది జులై 1వ తేదీ నాటికి 23 ఏళ్లలోపు వయసు కలిగిన వారు అర్హులన్నారు. ఎస్సీ కేటగిరీ వారు 25 ఏళ్లలోపు వరకు అర్హులన్నారు.