పులి సంచారంపై భయపడవలసిన అవసరం లేదు: ఎస్పీ మేరీ ప్రశాంతి

81చూసినవారు
పులి సంచారంపై భయపడవలసిన అవసరం లేదు: ఎస్పీ మేరీ ప్రశాంతి
ఏలూరు జిల్లాలోని పలు మండలాల్లో పులి సంచారంపై ప్రజలు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ. పులి సంచారం సమాచారంపై ఫారెస్ట్, పోలీసు అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో తగిన రక్షణచర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పులి సమాచారంపై డయల్ 100కు లేదా 112 ఏలూరు పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 83329 59175కు సమాచారం అందించాల్సిందిగా కోరారు.

ట్యాగ్స్ :