మొగల్తూరు: రతన్ టాటాకు ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఘన నివాళి

75చూసినవారు
టాటా గ్రూప్ ల అధినేత రతన్ టాటా తాను సంపాదనలో ఎక్కువ భాగం సేవలకే వినియోగించిన మహోన్నత వ్యక్తిగా నిలిచారని ఆర్యవైశ్య సంఘ సభ్యులు అన్నారు. గురువారం మొగల్తూరులో ఆ సంఘం కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భారత్ కు ఆయన లేని లోటు తీరనిది అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు కారుమూరి దత్తుడు, సీమకుర్తి బాలాజీ, కారుమూరి రవి, అనంతపల్లి అనిల్, మానేపల్లి రంగా తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్