నరసాపురం మండలం పాత నవరసపురంలో శుక్రవారం తెల్లవారుజామున కోడిపందెల శిబిరంపై పోలీసులు అకస్మికంగా మెరుపు దాడి చేశారు. గ్రామ శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. ఈ మేరకు పోలీసులు దాడి చేయగా 16 మంది అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3.31 లక్షలు నగదు, 23 కోళ్లు, 9 కత్తులు, 24 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు నరసాపురం రూరల్ సీఐ దుర్గా ప్రసాద్ చెప్పారు.