పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం తూర్పు గ్రామంలో వేంచేసియున్న శ్రీ గంట్లమ్మ అమ్మవారి ఆలయము నందు జాతర మహోత్సవములు ఏప్రిల్ 6న ప్రారంభమై మంగళవారంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి కాళీపట్నం శ్రీ గంట్ల అమ్మవారి ఆలయం నందు అన్న సంతర్పణ కార్యక్రమం కమిటీ సభ్యులు నిర్వహించారు. సుమారుగా 2000 మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదములను స్వీకరించారు.