దిగవల్లి గ్రామంలో మహిళపై మరో వ్యక్తి దాడి

61చూసినవారు
పాత కక్షలు నేపథ్యంలో నూజివీడు మండలం తూర్పు దిగి వెళ్లి గ్రామంలో గురువారం ఒక మహిళపై ఆమె సమీప బంధువు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీలతపై అదే గ్రామానికి చెందిన ఆమె సమీప బంధువు ప్రభాకర్ కర్రతో దాడి చేసినట్లు బాధితురాలు నూజివీడులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అకారణంగా తనపై తమ బంధువు దాడి చేసినట్లుగా ఆమె చెబుతోంది. ఏఎస్ఐ శేఖర్ ఆమె వద్ద వాంగ్మూలం నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్