నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని ఆగిరిపల్లి గ్రామంలో యాదవ బజారులో నూజివీడు గ్రామీణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో మీ పోలీస్. మీ రక్షణ అనే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్ లు, సైబర్ నేరాలు, 112 కాల్, దొంగతనాలు, హెల్మెట్ ధారణపై గ్రామ ప్రజలకు అవగాహన తెలియజేసి చిన్నారులకు రాత పుస్తకాలు, పెన్నులు అందజేశారు.