కొత్త చట్టాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని నూజివీడు రూరల్ సీఐ రామకృష్ణ కోరారు. నూజివీడు సర్కిల్ పరిధిలోని ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో శనివారం పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజాయి, మత్తు పదార్థాలు ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో పోలీసులకు సమాచారం ఇవ్వాలని దొంగతనాల నివారణకు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఆగిరిపల్లి ఎస్సై శుభశేకర్ పాల్గొన్నారు.