రాష్ట్ర ముఖ్యమంత్రి పేషీలో పిఏ-2 సిఎం ప్రద్యూమ్న సోమవారం పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు స్వాగతం పలికారు. ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఫోటో ప్రసాదాలు అందజేశారు. ఆయనకు ఆలయ ఇఓ ముచ్చర్ల శ్రీనివాస్, నరసాపురం ఆర్డిఓ దాసిరాజు, తహశీల్దార్ యడ్ల దుర్గా కిషోర్ స్వాగతం పలికారు.