పాలకొల్లు: రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగను పురస్కరించుకొని బుధవారం తన వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా పంట పొలానికి క్రిమిసంహారక మందులను స్ప్రే చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది రైతు అని తాను పండించిన పంటను ఇంటికి చేర్చుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుందని అన్నారు.