పాలకొల్లు పట్టణంలోని ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అనంతరం స్వామివారికి ఆలయ వేద పండితులు విశేష పూజలు మరియు అభిషేకాలు నిర్వహించారు.