పాలకొల్లు: క్యాన్సర్ బాధితురాలికి రూ. 10 లక్షల సిఎం రిలీఫ్ ఫండ్

80చూసినవారు
తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ బాలిక, క్యాన్సర్ వ్యాధితో, ఆర్థిక స్థితి సరిగా లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. విషయాన్ని ఆమె బంధువుల ద్వారా మంత్రి నిమ్మల కు తెలిపారు. స్పందించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, బాలిక వైద్యం నిమిత్తం, ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి రూ. 10 లక్షలను మంజూరు చేయించారు. సోమవారం సంబంధిత చెక్కును బాధితురాలికి స్వయంగా అందజేశారు. ముఖ్య టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్