పాలకొల్లు పట్టణంలో ఆదివారం 2కే రన్ సేవ్ గర్ల్ చైల్డ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. అనంతరం ఆమె విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ మీరు ఏం అవ్వాలో అది అవ్వండి అని గట్టిగా అనుకుంటే అయిపోతుంది సామి అంటూ సినిమా డైలాగ్ చెప్పారు. అలాగే ఆడపిల్లల పట్ల గౌరవంగా ముందుకు వెళ్లాలని అన్నారు. కొన్ని రోజుల పోతే పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆడపిల్లలు దొరకరని అబ్బాయిలకు సూచించారు.