పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన పురాతన శైవ క్షేత్రం పాలకొల్లు, శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామివారిని సోమవారం నాగసాధు లేడీ అఘోరి దర్శించుకున్నారు. క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని తనదైన శైలిలో పూజలు నిర్వహించారు. అఘోరిని చూసేందుకు భక్తులు బారులు తీరారు. అనంతరం శ్రీకాకుళం వెళ్ళిపోతున్నట్లు ఆఘోరి మీడియాతో చెప్పారు.