బుడమేరు వరద నియంత్రణ పై సి. ఏం చంద్రబాబు నాయుడు కు, సమగ్ర నివేదిక అందించేందుకు విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణలు కలిసి సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, మున్సిపల్ శాఖ సెక్రటరీ కన్నబాబు, సీఆర్డీఏ కమీషనర్ కాటమనేని భాస్కర్, ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.