అణగారినవర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ శాసన మండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు బలహీనవర్గాల నాయకుడు సర్దార్ గౌతులచ్చన్న 115వ జయంతి సందర్భంగా శుక్రవారం ఉయ్యూరులో టీడీపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ పాల్గొని లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.