వేలేరుపాడు సీపీఐ కార్యాలయంలో బుధవారం పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి కృష్ణచైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. వరద బాధితులుగా ఉన్న ప్రతి కుటుంబానికి సహాయం అందాలన్నారు. చిన్న, సన్నకారు రైతులు నష్టపోవడం వల్ల తిరిగి వ్యవసాయం చేసే పరిస్థితులు లేవని, వారికి ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు అందించాలన్నారు.