పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు మండలంలో గురువారం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వరద ప్రభావిత ప్రాంతాలలో బోటుపై ప్రయాణించి మండలంలోని తిరుమలాపురం గ్రామ ప్రజలకు నిత్యవసరాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం తరఫున 25 కేజీల బియ్యం, ఇతర వస్తువులను అందజేశారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.